ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని..

తూర్పుగోదావరి, కాకినాడ క్రైం: ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో నర్సింగ్‌ విద్యార్థిని మనస్తాపానికి గురై మూడంతస్తుల నర్సింగ్‌ స్కూల్‌ హాస్టల్‌ మేడపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మారేడుమిల్లి మండలం సెట్లవడ గ్రామానికి చెందిన డి.శిరీష 2018లో కాకినాడ జీజీహెచ్‌ నర్సింగ్‌ స్కూల్‌లో జీఎన్‌ఎం మూడేళ్ల ట్రైనింగ్‌ కోర్సులో చేరింది. కాకినాడ జీజీహెచ్‌లో ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న (ప్రస్తుతం మానేశాడు) బాలు అనే యువకుడితో శిరీష పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. బాలు హాస్టల్‌ వెనుక భాగం నుంచి నేరుగా శిరీష ఉంటున్న గది వద్దకు రావడం మొదలుపెట్టాడు. గురువారం రాత్రి కూడా వచ్చి ఆమెతో మాట్లాడడంతో ఇద్దరి మధ్య పెళ్లి ప్రస్తావన వచ్చింది.