చాలామంది కాకరకాయను చూడగానే ముఖం చిట్లిస్తారు. చేదంటూ దాని జోలికే వెళ్లరు. కానీ కాయ చేదైనా దాంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. అందుకే వారంలో ఒకసారైనా కాకరకాయను ఏదో ఒక వంటకంగా చేసుకుని తినండి. వంట ప్రక్రియలో చేదును విరిచేసే ప్రక్రియలూ ఉంటాయి. వాటిని అనుసరించి కాకరకాయను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం కలిగే ప్రయోజనాలివే...
♦ మెగ్నీషియ్, ఫోలేట్, జింక్, ఫాస్ఫరస్, మాంగనీస్, ఐరన్, క్యాల్షియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలూ ఎక్కువ.♦ కాకరకాయలో క్యాలరీలు చాలా తక్కువ అందుకే స్థూలకాయం, ఊబకాయం రాకుండా నివారిస్తుంది. క్యాలరీలు తక్కువగా పోషకాలు మాత్రం చాలా ఎక్కువ. ♦ కాకరలోని విటమిన్–సి దేహంలోని ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తుంది. మన దేహంలో పుట్టే ఫ్రీరాడికిల్స్ మ్యాలిగ్నంట్ కణాల (క్యాన్సర్ కారక కణాలు) ఉత్పత్తికి దోహదం చేస్తాయి. ఇలా కాకర సాధారణ క్యాన్సర్లనే కాకుండా, లుకేమియా లాంటి బ్లడ్‌క్యాన్సర్లనూ నివారిస్తుంది.