అక్కడ ప్రతి 16 నిమిషాలకో ప్రమాదం

టెక్సాస్‌ : అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో పట్టణంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రవాస భారతీయులు దుర్మరణం పాలయ్యారు. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారు జామున డెల్ వెబ్ బోల్వార్డ్, ఇంటర్ సెక్షన్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు ఫ్రిస్కో పోలీసులు వెల్లడించారు. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వారి వద్ద లభించిన ఆధారాల మేరకు చనిపోయిన వారు దివ్య ఆవుల (34), ఆమె భర్త రాజా గవిని (41) మరణించారు. వారితో పాటే ప్రయాణిస్తున్న వారి స్నేహితుడు ప్రేమనాథ్ రామనాథం (42) కూడా స్పాట్‌లోనే మృత్యువాతపడ్డారు. (టెక్సాస్‌లో కారు ప్రమాదం : ముగ్గురు తెలుగువారు మృతి)